సోమూర్‌లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సన్నాహాలు

నవపక్షం, మద్నూర్ ప్రతినిధి : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిధిలోని సోమూర్ గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామ దుర్గామాత ఉత్సవ కమిటీ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా మండప ఏర్పాటు, దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుమతి కోరుతూ మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో కమిటీ సభ్యులు తొలి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నరసింహులు, కమిటీ సభ్యుడు ఆనంద్‌తో పాటు ఇతర ప్రతినిధులు మద్నూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సబ్‌ ఇన్‌స్పెక్టర్ మోహన్‌ను కలిసి...