విద్యార్థులకు ఆచరణాత్మక జ్ఞానమే లక్ష్యం – రిటైల్ విక్రయ కేంద్రాల్లో పది రోజుల ఇంటర్న్‌షిప్

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానంతో పాటు ఆచరణాత్మక అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో మర్రిగూడ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులు మాల్‌ లోని ట్రెండ్స్, మీ మార్ట్ విక్రయ కేంద్రాల్లో పది రోజులపాటు ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం మాట్లాడుతూ, తరగతి గదిలో నేర్చుకున్న సైద్ధాంతిక అంశాలను వాస్తవ పని ప్రదేశాల్లో అన్వయించుకోవడం ద్వారా విద్యార్థుల్లో...