అనంతారంలో బీఆర్ఎస్లో చేరిన దొనగిరి వేణు
నవపక్షం, భువనగిరి ప్రతినిధి : భువనగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మండల ఓబీసీ ప్రధాన కార్యదర్శి దొనగిరి వేణు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దొనగిరి వేణు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేస్తూ, జెండా మోస్తున్న సీనియర్ నాయకులకు తగిన గుర్తింపు లభించడం లేదని విమర్శించారు....