యాదాద్రిలో గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న కళ్యాణి యాదవ్

  నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి : జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను పంపిణీ...