ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సామాజికవేత్త కర్నాటి శ్రీహరి

నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రానికి చెందిన సామాజికవేత్త కర్నాటి శ్రీహరి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల్లో తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాంపల్లి మండల పరిధిలో కేవలం ఇద్దరు సభ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉండటంతో ఈ ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. సమాజ సేవ, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో ఈ ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయి. సంస్థ అభివృద్ధికి, సేవా కార్యక్రమాల నిర్వహణకు...