రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీగా పోటీ చేస్తా: రెడ్డి సత్యనారాయణ

నవపక్షం, విజయనగరం జిల్లా ప్రతినిధి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు పతివాడపాలెం గ్రామానికి చెందిన యువ నాయకుడు రెడ్డి సత్యనారాయణ ప్రకటించారు. ఆయన ప్రకటనతో స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గత పదేళ్లుగా ఒక రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదనే అసంతృప్తి ఆయన సన్నిహితుల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎంపీటీసీగా పోటీ చేయాలనే నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామంలో సీనియర్...