డాకూర్‌లో ఘనంగా దుర్గాభవాని అమ్మవారి పూజలు

నవపక్షం, అందోల్ ప్రతినిధి : అందోల్ నియోజకవర్గం పరిధిలోని డాకూర్ గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామంలోని నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గాభవాని అమ్మవారి పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు 11వ వార్షికోత్సవానికి చేరుకోవడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నవచైతన్య యూత్ సభ్యులు మాట్లాడుతూ, యువత అంతా ఐక్యంగా ముందుకు వచ్చి ప్రారంభించిన అమ్మవారి పూజా కార్యక్రమాలను వరుసగా 11 ఏళ్లుగా...