అవల్ గావ్ గ్రామంలో వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

నవపక్షం, మద్నూర్ ప్రతినిధి : అవల్ గావ్ గ్రామంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను గ్రామ ప్రజలు అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గ్రామంలోని మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను అందంగా పేర్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల కోసం ప్రత్యేకంగా డీజే ఏర్పాటు చేయడంతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. డీజే పాటలకు అనుగుణంగా మహిళలు, యువతులు, గ్రామస్థులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఆటపాటలతో బతుకమ్మ...