డాకూర్‌లో ఘనంగా దుర్గాభవాని అమ్మవారి పూజలు – నవచైతన్య యూత్ 11వ వార్షికోత్సవం

నవపక్షం, ఆందోల్ ప్రతినిధి: అందోల్ నియోజకవర్గ పరిధిలోని డాకూర్ గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గాభవాని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమం నవచైతన్య యూత్ 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. యువత అంతా ఐక్యంగా ముందుకు సాగుతూ అమ్మవారి పూజా కార్యక్రమాలను ప్రారంభించి, విజయవంతంగా 11వ వార్షికోత్సవానికి చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత 11 ఏళ్లుగా అమ్మవారి...