దేవరకొండలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: దేవరకొండలో బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో న్యాయవాదులను, వైద్యులను కలుసుకొని ఎమ్మెల్సీ ఓటు ప్రాధాన్యతను వివరించారు. విద్యావంతులు, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వన్సూరి సుధాకర్, సీనియర్ నాయకులు షఫీర్, నక్క వెంకటేష్, పుష్పలత, భాస్కర్, ఉదయ్ పాల్గొన్నారు.