అంబేడ్కర్ గురుకుల పాఠశాలను దక్కించుకునే వరకు పోరాటం ఆగదు

నవపక్షం, కోట ప్రతినిధి: అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేతకు నిరసనగా పంట్రంగం వసంత్ చేపట్టిన నిరాహార దీక్షకు బహుజన యూత్ ఫోర్స్, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, సమాజ చైతన్య సమితి, మాల మహానాడు, నవ్యాంధ్ర రజక సంక్షేమ సంఘం, జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, అంబేడ్కర్ గురుకుల పాఠశాలను పరిరక్షించి, తిరిగి దక్కించుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.