చిట్టేడు జి.వి.ఆర్. ఫ్యాక్టరీలో కార్మికులపై నిబంధనల పంజా -12 గంటల పని.. 15 నిమిషాలు ఆలస్యమైతే సగం రోజు హాజరు!

  నవపక్షం, కోట మండల ప్రతినిధి :  కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు, న్యాయమైన వేతనాలు, విశ్రాంతి కల్పించాల్సిన పరిశ్రమల్లో పని గంటలు, హాజరు నిబంధనలు కార్మికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. కోట మండలం చిట్టేడు గ్రామంలోని జి.వి.ఆర్. రొయ్యల ఫ్యాక్టరీలో అమలు చేస్తున్న బయోమెట్రిక్ హాజరు సర్క్యులర్ ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. మరోవైపు రోజుకు 12 గంటల పాటు పని చేయాల్సి వస్తుండటంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది.   సర్క్యులర్‌లో...