రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీటీసీకి తీవ్రగాయాలు

  నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ పట్టణ శివారు జంగాలకాలనీలో వృద్ధ దంపతుల వాహనాన్ని డీసీఎం ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ప్రమాదంలో గాగిలాపూర్ మాజీ ఎంపీటీసీ తంగెళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కాలు విరిగి, తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.