శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి బండారు శివ

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మండల వ్యవసాయ అధికారి బండారు శివ పాల్గొని, శ్రీ సరస్వతీ దేవి అవతారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు ఉప్పల యశ్వంత్ శర్మ, సామాజికవేత్త కర్నాటి శ్రీహరి, శివ, కిరణ్, జశ్వంత్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.