రాచకొండ సవేందర్–సరిత దంపతుల అన్నదాన సహకారంతో శ్రీ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం
నకిరేకల్, నవపక్షం ప్రతినిధి: అన్నదానం మహాదానమనే స్ఫూర్తితో నకిరేకల్ పట్టణంలోని గోల్డ్ మార్కెట్లో శనివారం శ్రీ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ మహాలక్ష్మి జ్యువెలరీ యజమానులు రాచకొండ సవేందర్–సరిత దంపతులు అన్నదాన దాతలుగా వ్యవహరించారు. శ్రీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాతల సహకారంతో భక్తులకు, స్థానికులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆకలితో ఉన్నవారికి అన్నం అందించడం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని, సేవాభావాన్ని పెంపొందిస్తాయని నిర్వాహకులు...