శ్రీ దుర్గాదేవి పూజలో పాల్గొన్న ఆలంపల్లి ఆనంద్‌ దంపతులు

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి : మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆలంపల్లి ఆనంద్‌–రాధిక దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.