ఘనంగా పెద్ద అచంపల్లి లో బతుకమ్మ సంబరాలు.. అంబరాన్ని అంటిన పండుగ వేడుకలు

  నవపక్షం, కరీంనగర్ ప్రతినిధి :  తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ ఉత్సవాలు కరీంనగర్ జిల్లా, గంగాధర మండలం, పెద్ద అచంపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా, నేత్రపర్వంగా సాగుతున్నాయి. గ్రామంలోని బొడ్రాయి వాడ ప్రాంతంలో మహిళలు మరియు గ్రామస్థులందరూ కలిసి జరుపుకుంటున్న ఈ బతుకమ్మ సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ ఆడపడుచులు తమ సాంప్రదాయాన్ని చాటుతూ, రంగురంగుల పూలతో ఎంతో సుందరంగా బతుకమ్మలను తీర్చిదిద్దారు. బొడ్రాయి వద్ద గౌరమ్మను కొలుస్తూ, సాయంత్రం వేళ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ భక్తిశ్రద్ధలతో...