ఓయూలో కట్టమైసమ్మ ఆలయ ఘటనపై 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలి – జీవన్, ఏబీవీపీ

నవపక్షం, హైదరాబాద్, ప్రతినిధి :  ఉస్మానియా యూనివర్సిటీలోని మోయిన్ చెరువు సమీపంలో ఉన్న కట్టమైసమ్మ అమ్మవారి ఆలయానికి సంబంధించిన గేట్లు ధ్వంసమైనట్లు, అమ్మవారి విగ్రహం, హారతి సామగ్రి, గంటలు, నైవేద్య పాత్రలు కనిపించకుండా పోయినట్లు వస్తున్న సమాచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలను నిర్ధారించేందుకు పోలీసులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని, అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలించి, బాధ్యులుగా గుర్తించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన...