గుడివాడలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి :  కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగుల్లో వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ బతుకమ్మ సంబరాల్లో గ్రామ సర్పంచ్ రాచకొండ నాగమ్మ అంజయ్య పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో కలిసి వేడుకల్లో భాగస్వాములై, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రాధాన్యతను...