ఎంవీఎస్ఆర్ కళాశాల ప్రమాదంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి – మృతురాలి కుటుంబానికి రూ.2 కోట్ల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి, డా. కొండ గణేష్, BRSV రాష్ట్ర కార్యదర్శి

నవపక్షం , హైదరాబాద్ ప్రతినిధి : నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో డాండియా వేడుకల సందర్భంగా భారీ అలంకరణ ఆర్చ్ కూలి విద్యార్థిని నారాయణదాసు సోనా (18) మృతి చెందడం, మరో 14 మంది విద్యార్థులు గాయపడటం తీవ్ర దిగ్భ్రాంతికరం. ఈ ఘటనలో మృతురాలి సోదరి మీనా కూడా తీవ్రంగా గాయపడటం బాధాకరం. కళాశాల యాజమాన్యం భద్రతా ప్రమాణాలను పాటించడంలో నిర్లక్ష్యం వహించిందా అనే అంశంపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి, బాధ్యులపై వర్తించే చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన...