డీఎస్పీ ఉమాశ్రీని శాలువాతో సన్మానించిన డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి

నవపక్షం, వనపర్తి జిల్లా ప్రతినిధి : వనపర్తి మండలం చిన్నగుంటపల్లి గ్రామానికి చెందిన ఉమాశ్రీ డీఎస్పీగా ఉద్యోగం సాధించి, శిక్షణ పూర్తి చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏఐపీసీ అధ్యక్షులు, వనపర్తి నియోజకవర్గ యువ నాయకులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి ఆమెను శాలువాతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పోలీసు అధికారులు అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు...