గుడివాడలో కనకదుర్గమ్మ ఉత్సవాల్లో ఘనంగా అన్నదానం

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయంలో కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామమంతా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. గ్రామ ప్రజలంతా భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.