అత్యవసర సమయంలో రక్తదానం చేసిన రాజేందర్ రెడ్డి

నవపక్షం, శంషాబాద్ ప్రతినిధి : శంషాబాద్‌లోని ట్రైడెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి అత్యవసరంగా O నెగిటివ్ రక్తం అవసరం కావడంతో మూర్తుజగూడ గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డిని సంప్రదించారు. వెంటనే స్పందించిన ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేసిన రాజేందర్ రెడ్డిని పలువురు అభినందించారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆయన సేవాభావం పలువురికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.