రాయవరం మండలానికి చేరిన ఖాళీ బ్యాలెట్ బాక్సులు

నవపక్షం, రాయవరం ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాయవరం మండలంలో ఎన్నికల ఏర్పాట్లు వేగవంతమవుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని ముందస్తుగా సిద్ధం చేసే ప్రక్రియలో భాగంగా జిల్లా కార్యాలయం నుంచి పంపించిన ఖాళీ బ్యాలెట్ బాక్సులను మండల పరిషత్ కార్యాలయంలో భద్రపరిచినట్లు ఎంపీడీవో కె.వి.ఎస్.ఎస్. సూర్యనారాయణ మూర్తి తెలిపారు. ​ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సామగ్రిని ముందుగానే సమకూర్చుకునే చర్యల్లో భాగంగానే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల స్థాయిలో అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దీంతో...