నకిరేకల్‌లో దుర్గామాత యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ దుర్గా దేవి 4వ శరన్నవరాత్రోత్సవాల్లో పాల్గొన్న నరేష్ గౌడ్

నవపక్షం నకిరేకల్ ప్రతినిధి : నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపల్ కార్యాలయం పక్కన దుర్గామాత యువసేన ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ దుర్గా దేవి 4వ శరన్నవరాత్రోత్సవాల్లో కట్టంగూరి నరేష్ గౌడ్ పాల్గొని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, సమాజంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. దుర్గామాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, అభివృద్ధి కలగాలని ప్రార్థించారు.