రాయవరం మండల కేంద్రానికి చేరుకున్న 93 బ్యాలెట్ బాక్సులు ​- బ్యాలెట్ బాక్సుల భద్రతను పరిశీలించిన ఆర్వో శశాంక, డి.ఎస్.పి విద్య ​

నవపక్షం, రాయవరం ప్రతినిధి : మండల కేంద్రమైన రాయవరానికి చేరుకున్న బ్యాలెట్ బాక్సులను మండల రిటర్నింగ్ అధికారి బి.శశాంక సోమవారం తనిఖీ చేశారు. మండలానికి 75 బ్యాలెట్ బాక్సులు అవసరం కాగా 93 బాక్సులు చేరుకున్నాయని ఆమె తెలిపారు. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచినట్లు ఎంపీడీవో కె.వి.ఎస్.ఎస్.ఎస్ మూర్తి తెలిపారు. అంతకు ముందు డి.ఎస్పీ విద్య బ్యాలెట్ బాక్సుల భద్రతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్తు సిబ్బంది పాల్గొన్నారు.