నెలివాడలో ఘనంగా ముగిసిన దేవి నవరాత్రి వేడుకలు

నవపక్షం, విజయనగరం ప్రతినిధి : గ్రామంలో శ్రీ భాస్కర శర్మ పురోహితత్వంలో నిర్వహించిన దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, చివరి రోజు హోమం, కుంకుమ పూజలు భక్తిశ్రద్ధలతో జరిపారు. అమ్మవారి కలశాలను మహిళలు తలపై ధరించి గ్రామ వీధుల్లో నిర్వహించిన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం నిర్వాహకులు లాటరీ ద్వారా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భవాని మాలధారులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.