మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారు

    నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి : మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్రం లక్ష్మమ్మ–శ్రీరాములు దంపతులు, వారి కుమారుడు కోడలు గుర్రం నరేందర్–ఉషారాణి దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.