మండపేట నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు

నవపక్షం, మండపేట ప్రతినిధి : మండపేట నియోజకవర్గ ప్రజలకు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని పేర్కొన్నారు. దుర్గాభవాని మాత దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో తులతూగాలని ఆకాంక్షించారు. మండపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని,...