పైడిభీమవరం గ్రామపంచాయతీ వ్యవహారాలపై మీడియా సమావేశం
నవపక్షం, పైడిభీమవరం ప్రతినిధి: పైడిభీమవరం గ్రామపంచాయతీ పరిధిలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక అవకతవకలు, గ్రామపంచాయతీ పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు, TNTUC మాజీ అధ్యక్షులు దాట్ల సురేష్ వర్మ త్వరలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో గ్రామపంచాయతీకి సంబంధించిన పలు అంశాలపై తన వద్ద ఉన్నట్లు పేర్కొంటున్న పత్రాలు, ఆధారాలను మీడియా సమక్షంలో వెల్లడించనున్నట్లు సమాచారం. ప్రజాధనం వినియోగం, గ్రామపంచాయతీ పరిపాలనలో పారదర్శకత, సంబంధిత వ్యవహారాల్లో బాధ్యత వహించాల్సిన వ్యక్తుల పాత్ర తదితర అంశాలపై ఆయన...