BJYM జాతీయ ఉపాధ్యక్షురాలిగా మాలోత్ కోమలి నాయక్ నియామకం
నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాలోత్ కోమలి నాయక్ భారతీయ జనతా యువ మోర్చా (BJYM) జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. యువజన రంగంలో చురుకుగా పనిచేస్తూ, BJYM కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్న కోమలి నాయక్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో యువతకు సంబంధించిన అంశాలపై చురుకుగా పనిచేస్తూ, పార్టీ మరియు యువజన మోర్చా కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న కోమలి నాయక్, తనకు అప్పగించిన బాధ్యతల ద్వారా జాతీయ స్థాయిలో యువజన మోర్చా...