భవాని భక్తుల మృతిపై ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ దిగ్భ్రాంతి

  నవపక్షం, కాకినాడ ప్రతినిధి : ​కాకినాడ జిల్లా తుని మండలం రావికంపాడు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందడం పట్ల కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్న ఎంపీ, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదంలో...