అచ్చంపేట గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జిగా శుభప్రద్ పటేల్ నియామకం

నవపక్షం, అచ్చంపేట ప్రతినిధి : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వివిధ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జిగా శుభప్రద్ పటేల్‌ను నియమించారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో కీలక బాధ్యతను అప్పగించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు శుభప్రద్ పటేల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ నాయకత్వం అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో...