గజపతినగరం జెడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన తరఫున తాళ్లపూడి దుర్గ నామినేషన్

  నవపక్షం, విజయనగరం, ప్రతినిధి : గజపతినగరం మండలంలో ప్రజా సమస్యల పరిష్కారం, మండల అభివృద్ధి లక్ష్యంగా జనసేన పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా తాళ్లపూడి దుర్గ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గజపతినగరం మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి కోసం...