రహదారి దుస్థితితో దసరా సంబరాలకు దూరమైన శకృతండా గ్రామస్థులు

  నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: శకృతండా, బండమీది తండా గ్రామాల రహదారులు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జటావత్ ప్రకాశ్ నాయక్ (జేపీ) ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి దుస్థితి కారణంగా గ్రామస్థులు దసరా పండుగను సైతం సంతోషంగా జరుపుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. రహదారిపై ప్రయాణిస్తూ పలువురు గాయాలపాలవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పెండింగ్ రహదారి పనులను తక్షణమే పూర్తి చేసి, ప్రజలకు సురక్షిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని జేపీ డిమాండ్ చేశారు.