గొల్లపేట, వరిసాంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన దాట్ల సురేష్ వర్మ

నవపక్షం, పైడిభీమవరం ప్రతినిధి : పైడిభీమవరం గ్రామపంచాయతీ పరిధిలోని ఎంపీటీసీ-2 సెగ్మెంట్‌లో ఎన్నికల ప్రచార సందడి మొదలైంది. ఇందులో భాగంగా గొల్లపేట, వరిసాం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, టీఎన్‌టీయూసీ శ్రీకాకుళం జిల్లా మాజీ అధ్యక్షుడు దాట్ల సురేష్ వర్మ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తొలిరోజు ప్రచారంలో ఎంపీటీసీ-2 అభ్యర్థి సింక భూలక్ష్మితో కలిసి రెండు గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.