ఎల్ నినోని ఎదుర్కొందాం తెలంగాణ ప్రభుత్వానికి సహకరిద్దాం – సీనియర్ నాయకులు గాలెంక వినోద్ కుమార్
నవపక్షం, నాంపల్లి ప్రతినిధి : అక్టోబర్ 25 ఎల్ నినో విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాలేంక వినోద్ కుమార్ కోరారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలందరూ తమవంతు సహకారాన్ని అందించాలన్నారు.ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని,ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కావున నీటిని వృధా చేయకుండా,పొదుపుగా వాడాలని,తక్కువ నీటితో పండే పంటలను రైతులు...