రహదారి సమస్య పరిష్కరించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం
నవపక్షం, కాకినాడ ప్రతినిధి : కాకినాడ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం, కాజులూరు మండలం ఆర్యవటం శివారు తుమ్మలపల్లి లంకలో గత 15 నెలలుగా రహదారి సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామానికి చెందిన సుమారు 80 కుటుంబాలు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. తక్షణమే రహదారిని పునరుద్ధరించకపోతే ఎన్నికల్లో ఓటు వేసే ప్రసక్తే లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం తలెత్తిన వివాదం కారణంగా గ్రామానికి వెళ్లే రహదారిని ధ్వంసం చేయడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....