దేవరకొండలో 1,830 కిలోల నల్లబెల్లం పట్టివేత

  నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ ఎక్సైజ్ శాఖ అధికారులు డిండి రోడ్డులోని మైనంపల్లి గేటు వద్ద తనిఖీలు నిర్వహించి భారీగా నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం తయారీకి వినియోగించే 1,830 కిలోల నల్లబెల్లం, 60 కిలోల పటిక, ఇదు లీటర్ల దేశీయ మద్యాన్ని పట్టుకున్నారు. ఒక కారు, అశోక్ లేలాండ్ వాహనాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.