నాంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో ‘బేటీ బచావో–బేటీ పడావో’ కార్యక్రమం

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత, సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని మండల విద్యాధికారి అజయ్‌కుమార్‌ అన్నారు. నాంపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆయన ఆధ్వర్యంలో ‘బేటీ బచావో–బేటీ పడావో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ, బాలికలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ, నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. విద్య, వైద్యం, విజ్ఞానశాస్త్రం, రక్షణ రంగాల్లో మహిళలు విశేష ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. బాలికలు తమ సమస్యలను నిర్భయంగా...