కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే తెలంగాణలో కరువు పరిస్థితులు: జగదీష్ రెడ్డి, రవీంద్ర కుమార్
నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నీటి నిర్వహణలో వైఫల్యం కారణంగానే తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు. మంగళవారం దేవరకొండలోని సాయిశివ గార్డెన్లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు....