కార్యకర్తలపై చేయి వేస్తే నాపై వేసినట్లే: వైఎస్ జగన్
నవపక్షం, పులివెందుల ప్రతినిధి : పులివెందులలోని వైఎస్సార్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్ సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో తన పార్టీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు అనవసరంగా కాల్పులు జరపడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ శ్రేణులకు ప్రతి నిమిషం అండగా ఉంటానని స్పష్టం చేసిన జగన్ పులివెందులలో తమ కార్యకర్తలపై చేయి వేస్తే నేరుగా...