ఏడు దశాబ్దాల తర్వాత హ్యాండ్లూమ్ హౌస్ బోర్డులో తెలంగాణకు చోటు – డైరెక్టర్‌గా కర్నాటి వజ్రమ్మ ఏకగ్రీవ ఎన్నిక

  నవపక్షం, మునుగోడు ప్రతినిధి : తెలంగాణ చేనేత రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించే ప్రతిష్ఠాత్మక సంస్థ ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ మార్కెటింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌ (హ్యాండ్లూమ్ హౌస్) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా గట్టుప్పల్ చేనేత సహకార సంఘం అధ్యక్షురాలు కర్నాటి వజ్రమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంస్థ ఏడు దశాబ్దాల చరిత్రలో తెలంగాణకు తొలిసారిగా ఈ స్థాయి ప్రాతినిధ్యం లభించడం విశేషం. జనరల్ బాడీ సభ్యురాలిగా ఎన్నికైన వజ్రమ్మ, వివిధ...