నల్లబెల్లిని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి – పోగుల చిరంజీవి
నవపక్షం, నల్లబెల్లి, అక్టోబర్ 28: నల్లబెల్లి మండలంలో వర్షాభావంతో చెరువులు నిండక, భూగర్భ జలాలు అడుగంటడంతో బావులు, బోర్లు ఎండిపోయి పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ యువజన నాయకుడు పోగుల చిరంజీవి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని, కొన్ని గ్రామాల్లో తాగునీరు, పశువులకు నీటి కొరత ఏర్పడిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ తక్షణమే క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి నల్లబెల్లిని కరువు మండలంగా ప్రకటించాలని, పంట నష్టపరిహారం అందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.