నెల్లూరుపల్లి కొత్తపాలెంలో కట్ట హారికకు మద్దతుగా టీడీపీ ఇంటింటి ప్రచారం

  నవపక్షం, నెల్లూరుపల్లి ప్రతినిధి : నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కట్ట హారికకు మద్దతుగా ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా బుధవారం నిర్వహించారు. ముందుగా శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రజలను కలుసుకున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి కట్ట హారికకు మద్దతు ఇవ్వాలని కోరుతూ,గ్రామ అభివృద్ధికి...