రిజర్వాయర్ను సందర్శించి బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి : శివన్నగూడెం రిజర్వాయర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతుల పంట పొలాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శివన్నగూడెం గ్రామంలో నిరసన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రిజర్వాయర్ను సందర్శించి పనుల పరిస్థితిని పరిశీలించారు. రిజర్వాయర్ పనులు పూర్తికాకపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని నాయకులు కోరారు. తక్షణమే స్పందించి నిర్మాణ పనులను వేగవంతం చేసి, సాగునీరు, తాగునీటి సమస్యకు...