బీజేపీ తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా కిరణ్ గౌడ్ నియామకం

  నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :  భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా కిరణ్ గౌడ్ (లడ్డూ) నియమితులయ్యారు. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, అంకితభావం, సంస్థాగత కార్యక్రమాల్లో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ పార్టీ నాయకత్వం ఈ బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ డిజిటల్ ప్రచారాన్ని...