నల్లబెల్లిని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలి – బీఆర్ఎస్ యువజన నాయకుడు పోగుల చిరంజీవి యాదవ్ డిమాండ్
నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి: నల్లబెల్లి మండలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు, కుంటల్లో నీరు లేక, భూగర్భ జలాలు అడుగంటడంతో బావులు, బోర్లు ఎండిపోయి పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ యువజన నాయకుడు పోగుల చిరంజీవి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు సాగు చేసిన పంటలకు నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంటల సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతులు పంటలు ఎండిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారని, అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. మండలంలోని...