రేపు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు – బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి కోలా హరీష్ పటేల్

  నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 24వ విడత నిధులు అక్టోబర్ 30న రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి కోలా హరీష్ పటేల్ తెలిపారు. ఈ విడతలో దేశవ్యాప్తంగా 9.34 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.18,680 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి ఖర్చుల...