ట్రెండ్స్ స్టోర్‌ను సందర్శించిన తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు
నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి : మర్రిగూడ మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మాల్లోని ట్రెండ్స్ స్టోర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టోర్ నిర్వహణ, వస్తువుల విక్రయ విధానం, మార్కెటింగ్ పద్ధతులపై అవగాహన పొందారు. పుస్తక జ్ఞానంతోపాటు ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి క్షేత్రస్థాయి పర్యటనలు ఎంతగానో దోహదపడతాయని పాఠశాల ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం, పాఠశాల ఉపాధ్యాయురాలు సబితా, ఒకేషనల్ ట్రైనర్ సింగం వెంకటరమణ తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు వాస్తవ వ్యాపార నిర్వహణపై అవగాహన కలగడంతోపాటు భవిష్యత్తులో...